నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట మండలం ర్యాలమడుగు గ్రామానికి చెందిన శ్రీనివాస్ ముదిరాజ్ మరణించిన విషయం నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి తెలుసుకొని, శుక్రవారం వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యాన్ని చెప్పారు. వారితో పాటు మండల పార్టీ అధ్యక్షులు పరమేష్, మాజీ సర్పంచ్లు మాణిక్ రెడ్డి, వెంకటేశం, పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్, రమేష్, తదితరులు ఉన్నారు.