ట్రాఫిక్ ఉల్లంఘన.. మంత్రి కొడుక్కి రూ.7,000 జరిమానా (వీడియో)
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వాహనం నడపడంతో మంత్రి కొడుక్కి భారీ షాక్ తగిలింది. రవాణా శాఖ రూ.7 వేలు జరిమానా విధించింది. రాజస్థాన్ డిప్యూటీ సీఎం, రవాణా మంత్రి ప్రేమ్ చంద్ బైర్వా మైనర్ కొడుకు తన మోడిఫైడ్ వాహనాన్ని నిబంధనలు ఉల్లంఘిస్తూ నడిపాడు. ఈ వీడియో వైరల్ కావడంతో రాష్ట్ర రవాణా శాఖ అతనికి రూ.7,000 జరిమానా విధించింది.