నేరేడు చర్ల మండల కేంద్రానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం హాజరుకానున్నట్లు మంత్రి క్యాంపు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. నేరేడు చర్లలో బీటీ, సీసీ రోడ్లు, లైబ్రరీ భవనానికి శంకు స్థాపన, రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో స్ధానిక పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరు కావాలని వారు కోరారు.