కోదాడ: శిథిలమైన భవనం తొలగింపు
మునగాల మండల కేంద్రం శిథిలమైన ప్రభుత్వ వైద్యశాల పాత భవనాన్ని మంగళవారం ఆర్ అండ్ బి శాఖ అధికారులు కూల్చివేశారు. భవనం శిధిలమై ప్రమాదకరంగా మారిందని స్థానిక సామజిక కార్యకర్త సైదులు భవనం కూల్చివేయాలని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి , ఎమ్మెల్యే పద్మావతి, జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాలు అందజేశారు. స్పందించిన వారు కూల్చివేతకు ఆర్ అండ్ బి శాఖకు ఆదేశాలు ఇచ్చారని సైదులు తెలిపారు.