పొట్టి శ్రీరాములు పేరు మార్చొద్దంటూ కలెక్టర్కు వినతి
వికారాబాద్ జిల్లాలోని ఆర్యవైశ్యులు ఆగ్రహరించారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయంకు ఉన్న పొట్టి శ్రీరాములు పేరును మర్చాలని తీసుకున్న నిర్ణయంపై సోమవారం వికారాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో తాండూరు నుంచి ఆర్యవైశ్యులు భారీగా తరలి వెళ్లారు. పొట్టిశ్రీరాములు పేరు మార్పును రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు.