వనపర్తి
పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
వనపర్తి జిల్లాలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు గాను ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి నుషిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతి (డే స్కాలర్స్), 5వ తరగతి (రెసిడెన్షియల్)లో ప్రవేశాలకు జిల్లా విద్యార్థులు అర్హులు అన్నారు. జూన్ 7లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు జిల్లా కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.