ములుగు జిల్లా కేంద్రంలో గురువారం సీపీఐ శత వార్షికోత్సవ ర్యాలీ నిర్వహించారు. గృహ నిర్మాణ కార్మికులు, హమాలీలతో కలిసి జాతీయ రహదారిపై ర్యాలీ సీపీఐ నాయకులు చేపట్టారు. పేద ప్రజల కోసం శత సంవత్సరం గా ఎన్నో పోరాటాలు చేసి వారి ఆకాంక్షలను నెరవేర్చి నేడు శత వార్షికోత్సవం జరుపుకుంటుందని సీపీఐ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.