ములుగు జిల్లా ఏటూరునాగారంలోని మసీదులో శనివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ ప్రజలు సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. పవిత్ర రంజాన్ మాసంలోని ప్రార్థనలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. అల్లా దీవెనలతో ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.