ములుగు జిల్లాలో శనివారం మంత్రి సీతక్క పర్యటించారు. ఇందులో భాగంగా వెంకటాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో సర్వీస్ నౌ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దత్తత తీసుకున్న గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సీతక్క పాల్గొని స్థానికుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన తాగునీటి మినీ ట్యాంకును ప్రారంభించారు. అనంతరం ములుగు మండలం జగ్గన్నపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు.