నర్సంపేట: పోలీస్ కుటుంబాలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలి

82చూసినవారు
నర్సంపేట: పోలీస్ కుటుంబాలపై ప్రభుత్వ నిర్బంధాన్ని ఆపాలి
తెలంగాణ స్పెషల్ ఫోర్స్ పోలీస్ కుటుంబాలపై ప్రభుత్వం నిర్బంధాన్ని ఆపాలని ఏఐఎన్టీయూ న్యూ రాష్ట్ర అధ్యక్షుడు మోడెం మల్లేశం డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆ సంఘం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మల్లేశం మాట్లాడారు. ఒకే పోలీస్ విధానాన్ని అమలు చేయాలని స్పెషల్ ఫోర్స్ పోలీసులు, వారి కుటుంబ సభ్యులు చేస్తున్న ఆందోళనపై ప్రభుత్వం క్రమశిక్షణ పేరుతో ఉద్యోగాల నుంచి తొలగించడం తగదన్నారు.

సంబంధిత పోస్ట్