దామెర: ప్రభుత్వం మారితే శంకుస్థాపన శిలాఫలకాలు మార్చుతారా?
గత ఎమ్మెల్యే ధర్మారెడ్డి శంకుస్థాపన చేసిన పనికి ఇప్పటి ఎమ్మెల్యే రేవురి, ఒక అధికారిక శిలాఫలకం ఉండగా మరొకటి ఏర్పాటు చేయటం ఏంటని, దీనికి అధికారులు బాధ్యత వహించాలని దామెరా బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ఆరోపించారు. దామెర మండలం సింగరాజుపల్లి గ్రామం నుండి హరిచంద్ర నాయక్ తండా వరకు అప్పటి ఎమ్మెల్యే మూడు కోట్ల నిధులతో 2023లో శంకుస్థాపన చేశారు. పాత పనికే మళ్ళీ శంకుస్థాపన చేయడం విడ్డురం అన్నారు.