గందరగోళంగా స్టేషన్ ఘనపూర్ గ్రామసభ బుధవారం జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో. పెళ్ళికాని వారి పేరు ఎలా చేర్చారాంటూ అధికారులను మహిళలు నిలదీశారు. అర్హుల జాబితా పూర్తిగా తప్పుల తడకగా ఉందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబితా పైనుండి వచ్చిందంటూ అధికారుల పొంతనలేని సమాధానం ఇచ్చారు. ఈ జాబితాను రద్దుచేసి రీ సర్వే చేయాలని ఈ సందర్భంగా మహిళలు డిమాండ్ చేశారు.