చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్‌కు మధ్య పెరిగిన దూరం?

AP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ల మధ్య దూరం పెరిగిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల సెక్రటరీలతో నిర్వహించిన సమావేశానికి పవన్ హాజరు కాలేదు. కొద్ది రోజుల క్రితం జరిగిన కేబినెట్ భేటీకి సైతం ఆయన వెళ్లకపోవడంతో ఈ ప్రచారానికి బలం చేకూరింది. తాను పవన్ తో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆయన దొరకలేదని చంద్రబాబు అన్నట్లు తెలుస్తోంది. మరో వైపు అనారోగ్య కారణాల వల్లే పవన్ ఈ కార్యక్రమాలకు వెళ్లలేదని జనసేన నేతలు చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్