అమలాపురం: పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వ్యాఖ్యలపై అసంతృప్తి

ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజుకు తప్పుడు సమాచారం ఇచ్చిన ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు పెడతామంటూ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. మంగళవారం అమలాపురంలో మాట్లాడుతూ విద్యార్థుల ఎన్రోల్మెంట్ నివేదికను తప్పుగా ఇచ్చిన ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు పెడతామని విద్యాశాఖ కమిషనర్ మీడియాతో మాట్లాడటం దారుణం అన్నారు. తక్షణమే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్