బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అమలాపురంలో ఎర్ర వంతెన వద్దనున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మానేపల్లి అయ్యాజీ వేమా, బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు నల్లా పవన్ కుమార్ పాల్గొని పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు వారు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.