ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు ఆమోదం లభించింది. రెండు కాంప్లిమెంటరీ స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు లోక్‌సభ సచివాలయం తాజాగా అనుమతి ఇచ్చింది. పార్లమెంట్‌లోని సంసద్ భవన్‌లో సంగం, నలంద లైబ్రరీ వద్ద సభ్యులకు ఇబ్బంది లేకుండా స్టాల్స్ ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటుకు అనుమతివ్వాలని టీడీపీ ఎంపీలు గతంలో స్పీకర్ ఓం బిర్లాను కోరిన సంగతి తెలిసిందే.