కార్తీకమాసంలో పిక్నిక్ సందడి వాతావరణం మొదలయ్యింది. ఈ క్రమంలో కొయ్యూరు మండలం గాదిగుమ్మి జలపాతం వద్ద ఆదివారం పర్యాటకులు కుటుంబం సమేతంగా వచ్చి ఆనందంగా గడిపారు. దూరం ప్రాంతాల నుంచి జనం రావడంతో గాదిగుమ్మి జలపాతం వద్ద కిటకిటలాడింది. ఇక్కడ ఎన్నో ప్రమాదాలు జరిగాయని, అధికారులు స్పందించి వాటర్ ఫాల్ చుట్టూ కంచెల ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు.