బిజెపి ఆర్టిజన్ సెల్ కో కన్వీనర్ల నియామకం
భారతీయ జనతా పార్టీ అనకాపల్లి జిల్లా ఆర్టిజన్ సెల్ కో కన్వీనర్ లను శుక్రవారం పార్టీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో నియమించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మొల్లేటి ప్రసాద్, షేక్ నూరులకు బిజెపి ఆర్టిజన్ సెల్ జిల్లా కన్వీనర్ కాసర్ల పవన్ చేతుల మీదుగా వారికి నియామక పత్రాలు అందజేశారు. సందర్భంగా పరమేశ్వర రావు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు.