స్టీల్ ప్లాంట్ వద్ద షర్మిల ఆందోళన
విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల బుధవారం ఆందోళన నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి కొద్దిసేపు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు కార్మికులు చేస్తున్న రిలే దీక్షలకు ఆమె మద్దతు తెలిపారు.