విరబూసిన బ్రహ్మ కమలం, హారతులు పట్టిన మహిళలు
అరుదుగా కనిపించే బ్రహ్మ కమలం పువ్వు ఒకసారిగా ప్రత్యక్షం అవడంతో మహిళల్లో భక్తిపార్వస్యాలు పొంగిపొర్లాయి. దీంతో ఆదివారం రాత్రి మాడుగులకొబ్బరి తోట వీదిలో గల తాడి బంగారయ్య ఇంట్లో ఈ బ్రహ్మ కమలం పువ్వు పూయాడంతో మహిళలు పూజలు నిర్వహించి హరతులు పట్టారు. రెండేళ్ల క్రితం తమ బంధువుల ఇంటి నుంచి ఈ మొక్క తెచ్చి పెరట్లో నాటారు. అయితే పూచిన ఈ బ్రహ్మ కమలం పువ్వుని సాక్షాత్తు బ్రహ్మ దేవుని రూపంగా కొలుస్తారు.