విశాఖ: నిర్మానుష్యంగా మహానగరం
విశాఖ మహానగరం నిర్మానుష్యంగా మారింది. నగరంలో నివసించే ప్రజలు సంక్రాంతి నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్లారు. దీంతో నిత్యం ట్రాఫిక్ తో రద్దీగా ఉండే మద్దిలపాలెం, ద్వారకా నగర్, రామ టాకీస్, దాబా గార్డెన్స్ తదితర రహదారులు బుధవారం నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. రోడ్లపై జనసంచారం చాలా తగ్గింది. సంక్రాంతి వేడుకల్లో కనుమ పండుగకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మాంసాహారులు ప్రత్యేక వంటలతో ఆహారాన్ని భుజిస్తారు.