అబద్ధపు రాజకీయాలు మానుకో ఉషశ్రీ: టీడీపీ సర్పంచ్ లు
అబద్ధపు రాజకీయాలు మానుకోవాలని, ఉనికి కోసం సర్పంచ్ లను వాడుకోవడం సిగ్గుచేటు అని పెనుకొండ నియోజకవర్గంలోని టీడీపీ సర్పంచ్ లు, టీడీపీ నాయకులు పేర్కొన్నారు. గురువారం పెనుకొండ పట్టణంలోని టిడిపి కార్యాలయంలో వైసిపి జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ఉషశ్రీ పై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉషాశ్రీ సర్పంచ్ నిధులు విడుదల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వలించినట్లు వుందని తెలిపారు.