విద్యుత్ సబ్ స్టేషన్ ను ముట్టడించిన రైతులు
యాడికి మండలం నిట్టూరు విద్యుత్ సబేషన్ ను సోమవారం రైతులు ముట్టడించారు. గత పది రోజులుగా విద్యుత్ సరఫరా సక్రమంగా చేయడం లేదని ఆరోపిస్తూ రైతులు సబేషన్ ముట్టడించారు. ఈ సందర్భంగా రైతులు విద్యుత్ శాఖ అధికారులకు, సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో తోటల కింద సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.