శ్రీలలిత త్రిపురసుందరిగా దర్శనమిచ్చిన గాయత్రిమాత
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తాడిపత్రి పట్టణంలోని సంజీవనగర్ జీరో రోడ్డులో వెలసిన. శ్రీవేద మాత గాయత్రిదేవి అమ్మవారు సోమవారం శ్రీలలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అమ్మ వారిని శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. పెద్దఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు.