ప్రభుత్వ భూములకు అసైన్డ్ పట్టాలు ఇవ్వాలని సాగు దారుల వినతి
శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలం కోగిర గ్రామానికి శుక్రవారం వచ్చిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మకి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు నారాయణ ఆధ్వర్యంలో కోగిర, శ్యాపురం, కంబాల పల్లి గ్రామాల భూమిలేని నిరుపేదలు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా భూమి లేని నిరుపేదలు సాగు చేసుకుంటూ జీవనం చేస్తున్న ప్రభుత్వ భూములకు అసైన్డ్ పట్టాలు ఇవ్వాలని సాగుదారులతో కలసి కోరారు.