జమ్మలమడుగు: శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో ఘనంగా చండిహోమం
కడప జిల్లా జమ్మలమడుగు శ్రీ జ్ఞాన షిరిడి సాయి బాబా ఆలయ ప్రాంగణంలోని శ్రీ రాజ రాజేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారు వెలసి ఐదు సంవత్సరాలు పూర్తి సందర్బంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం కార్తీక పౌర్ణమి పూజారి గిరినాధ శర్మ ఆధ్వర్యంలో గణపతి పూజ, రాజ రాజేశ్వరి అమ్మవారికి అభిషేకాలు, చండిహోమాలను వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు.