రామసముద్రం మండలం అరికెల పంచాయతీ యల్లంపల్లి గ్రామానికి చెందిన పి. అమరనాథ్ రెడ్డి గురువారం కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థలం శ్రీ మంజునాథస్వామి ఆలయానికి 10 టన్నుల టమాటాలు విరాళంగా పంపించారు. ఆయన మాట్లాడుతూ. ప్రతి సంవత్సరం 4 నెలలకొకసారి 10 టన్నుల చొప్పున తిరుమల, ధర్మస్థలం భక్తుల అన్నదానంలో భాగంగా టమాటాలను పంపుతున్నట్లు తెలిపారు. ఆయన భక్తికి చుట్టుపక్కల గ్రామ ప్రజలు అభినందించారు.