Oct 18, 2024, 12:10 IST/
కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే భార్యాభర్తలు హ్యాపీగా ఉంటారు: పండితులు
Oct 18, 2024, 12:10 IST
హిందూ సంప్రదాయంలో దీపారాధనకు చాలా ముఖ్య పాత్ర ఉంది. దీపారాధనకు ఎక్కువగా కొబ్బరి నూనె, నువ్వుల నూనె, నెయ్యి వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. కొబ్బరి నూనెతో ఎక్కువగా దీపారాధన చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా కూడా జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారని పండితులు సూచిస్తున్నారు.