పిచ్చాటూరు: 11 నుంచి వేరుశనగ విత్తనాల పంపిణీ
పిచ్చాటూరులో రైతులకు రాయితీ వేరుశనగ విత్తనాలను 11వ తేదీ నుంచి ఇవ్వడం జరుగుతుందని వ్యవసాయ అధికారి సంజీవరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ. వేరుశనగ విత్తనాలు కావలసిన రైతులు ఆధార్ కార్డుతో తమను సంప్రదించాలన్నారు. 30 కేజీల విత్తనాలు గల ప్యాకెట్2ను సబ్సిడీపోను 1728 రూపాయలకు అందిస్తున్నట్లు వెల్లడించారు.