చిత్తూరు జిల్లా, నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ను ఎమ్మార్పీఎస్ నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు నగిరి నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలపై ఎమ్మెల్యేకి వినతి పత్రం అందించారు. తాము అర్జీలో విన్నవించుకున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఎమ్మెల్యేను నాయకులు కోరారు. ఈ విషయంపై ఎమ్మెల్యే సుముఖంగా స్పందించినట్లు ఎమ్మార్పీఎస్ నేతలు తెలిపారు.