నగరి నియోజకవర్గం పుత్తూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో తమిళ ఉపాధ్యాయురాలు వీఎస్ బేబీ కస్తూరి బాయ్ గతేడాది జూన్ 25 నుంచి పాఠశాల విధులకు హాజరు కావడం లేదు. ఈ సందర్భంగా ఉప విద్యా శాఖాధికారి డీఈఓకు ఫిర్యాదు చేశారు. తమిళ టీచర్ బేబీ విచారణకు లోబడి విధులకు హాజరు కావాలని ఆయన శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. విధులకు హాజరు కాకపొతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.