నాగర్ కర్నూల్: ధ్యానంతోనే శారీరక మానసిక ప్రశాంతత
ధ్యానంతోనే శారీరక, మానసిక ప్రశాంతత సాధ్యమని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, కర్నూలు ఎంపీ నాగరాజు లు చెప్పారు. శనివారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం హనుమాస్ పల్లి మహేశ్వర మహా పిరమిడ్ లో 11 రోజులపాటు నిర్వహించే పత్రీజీ ధ్యానమహా యాగం ను ధ్యాన గురువు కూతురు పరిమళ పత్రీజీ తో కలిసి జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. మనిషి ఆరోగ్యం కోసం రోజు ధ్యాన సాధన చేయాలని పేర్కొన్నారు.