కాట్రేనికోన: ఈకేవైసీ కోసం ఎగబడిన వినియోగదారులు
కాట్రేనికోన ఇండేన్ గ్యాస్ కార్యాలయం వద్దకు ఈ కేవైసీ కోసం సోమవారం వినియోగదారులు భారీగా తరలి వచ్చారు. ఈ కేవైసీ కోసం వినియోగదారులు ఎగబడటంతో అక్కడ పరిస్థితిని అదుపు చేయలేక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఈ కేవైసీ ఉన్నవారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వినియోగదారులు భారీగా తరలివచ్చారు.