అమలాపురం: పెళ్లిళ్ల వెంకన్న కళ్యాణ మహోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు

74చూసినవారు
అమలాపురం: పెళ్లిళ్ల వెంకన్న కళ్యాణ మహోత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు
అమలాపురం పట్టణం మహిపాల వీధిలో పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 4 వ తేదీ నుంచి 13వ తేదీ వరకు శ్రీ స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయని ఈవో యర్రా వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ కళ్యాణ మహోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేయనున్నారని, వారికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

సంబంధిత పోస్ట్