రామచంద్రాపురంలోని ఏపీ ట్రాన్స్ కో 132 కేవీ సబ్ స్టేషన్లో విద్యుత్ పరికరాలు మార్పు వల్ల ఆదివారం విద్యుత్ సరఫరాలో పలుమార్లు అంతరాయం ఏర్పడుతుందని అమలాపురం విద్యుత్ ఈఈ రవికుమార్ శనివారం తెలిపారు. దీనితో ఆదివారం అమలాపురం చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఉ. 9 గంటల నుంచి సా. 4 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం వచ్చే అవకాశం ఉందన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.