కోనసీమ జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు సక్రమంగా ఉండేలా నవినీకరణ చేపట్టిన సర్వే ప్రతిపాదనలు కాంపోనెంట్ వారీగా విద్యార్థుల దామాషా ప్రాతిపదికన రూపొందించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులకు సూచించారు. ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సర్వే నివేదికలలో స్పష్టత కొరవడిందన్నారు.