గున్నేపల్లి అగ్రహారంలో ట్యాంక్ నిర్మించాలని ఆందోళన

69చూసినవారు
అమలాపురం రూరల్ మండలం గున్నేపల్లి అగ్రహారం గ్రామంలో మంచినీటి ట్యాంక్ నిర్మాణం చేస్తుంటే కొంతమంది వ్యక్తులు అడ్డుకుంటున్నారని గ్రామస్థులు వాపోయారు. సర్పంచ్ పెద్దిరెడ్డి రాము ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ప్రజలకు తాగునీరు అందించడానికి నిర్మించే ట్యాంకు పనులు అడ్డుకోవడం తగదన్నారు. పనులు కొనసాగేలా చూడాలని గ్రామస్థులు కలెక్టరేట్ ఏవోకు వినతి పత్రం అందించారు.

సంబంధిత పోస్ట్