గ్రామాల్లో చేపట్టే రీసర్వేపై ముందుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అమలాపురం ఆర్డీవో మాధవి తెలిపారు. మామిడికుదురు మండలం బి. దొడ్డవరంలో మంగళవారం జరిగిన గ్రామసభలో ఆమె పాల్గొన్నారు. రీసర్వే చేపట్టే గ్రామాల్లో ముందుగా ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం గ్రామ సభలో పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేస్తున్నామని చెప్పారు. రీసర్వేకు రైతుల సహకరించాలని ఆర్డీవో కోరారు. సభలో ఎమ్మార్వో ఆచార్యులు పాల్గొన్నారు.