కాకినాడ నగరంలో జిల్లా బిజెపి పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు పార్టీ జెండా ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం రైతు బజార్ వద్ద బిజెపి నాయకులు కవి కొండలభీమశంకర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు విశ్వేశ్వరరావు కార్యకర్తలు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం పని చేసే ఏకైక పార్టీ బీజేపీ అని తెలిపారు.