కాకినాడ: ఎలైట్ గ్రీన్ సిటీ సేవా కార్యక్రమాలు అభినందనీయం

72చూసినవారు
కాకినాడ: ఎలైట్ గ్రీన్ సిటీ సేవా కార్యక్రమాలు అభినందనీయం
కాకినాడ ఎలైట్ గ్రీన్ సిటీ వారి సేవా కార్యక్రమాలు అభినందనీయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. ఆయన కాకినాడలో ఎలైట్ గ్రీన్ సిటీ ఆధ్వర్యంలో రూ. 25 లక్షల విలువ చేసే కుట్టుమిషన్లను లబ్ధిదారులకు శనివారం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యేను నిర్వాహకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎలైట్ గ్రీన్ సిటీ నిర్వాహకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్