మారెమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సత్యానందరావు
కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో వేంచేసి యున్న గ్రామ దేవత మారెమ్మ అమ్మవారిని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బుధవారం దర్శించుకున్నారు. అలాగే స్థానికంగా ఏర్పాటు చేసిన ప్రభలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న మారెమ్మ అమ్మవారి ఆలయాన్ని ఆలయ కమిటీతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో త్సామా బాబు, బండారు బులితాత, చీకట్ల అబ్బు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.