కొత్తపేట: లోకేష్ జన్మదిన వేడుకలకు తరలిరండి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలకు అధిక సంఖ్యలో తరలిరావాలని కొత్తపేట మండల టిడిపి అధ్యక్షులు కంఠం శెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కొత్తపేటలో బుధవారం ఆయన మాట్లాడుతూ రావులపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం తొమ్మిది గంటలకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు.