నీటి సంఘాల ఎన్నికల్లో కూటమి తరుపున పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికైన మండపేట, కాలేరు, యండగండి నీటి సంఘాల సభ్యులు ఆదివారం మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంధర్బంగా వారందరినీ ఎమ్మెల్యే వేగుళ్ళ పూలమాలలతో, దుశ్శాలువాలతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు.