అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పిఠాపురం సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. పిఠాపురంలో ఉప్పాడ రైల్వే గేట్ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్న వార్తల నేపథ్యంలో శనివారం రాత్రి పోలీసులు డ్రోన్ కెమెరాలతో ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. డ్రోన్ కెమెరాల పర్యవేక్షణతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తామని సీఐ శ్రీనివాస్ తెలియజేశారు. సీఐతో పాటు పట్టణ ఎస్ఐ మణికుమార్ పాల్గొన్నారు.