అర్హులైన ప్రతి పేదవారికి ఇళ్ల స్థలం ఇచ్చి లోన్ కూడా అందిస్తామని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. సోమవారం కొత్తపల్లి మండలం ఆనంద్ నగర్ ఇళ్ల స్థలాలు లేఅవుట్ ను వర్మ పరిశీలించారు. స్థానికంగా ఉన్న గ్రామస్థులకు ఇక్కడ ఇళ్ల స్థలం అందిస్తామని కలెక్టరు, పవన్ కళ్యాణ్ కు లేఖ రాశానని, త్వరలోనే అధికారులు దర్యాప్తు చేపట్టి అర్హులకు ఇళ్ల స్థలం అందిస్తారని వర్మ తెలిపారు.