రాజమండ్రిలో పలు అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. రాజమండ్రిలోని 9వ డివిజన్ లో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి సోమవారం శంఖుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక నగరంలో సుమారు రూ. 9. 54 కోట్ల మేరకు అభివృద్ధి పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు.