
కడియం: ఓటు ప్రజాస్వామ్యానికి జీవనాడి- ఎంపీపీ ప్రసాద్
ఓటు ప్రజాస్వామ్యానికి జీవనాడి వంటిదని ప్రతి ఒక్కరు ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలని కడియం మండల పరిషత్ అధ్యక్షులు వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రమైన కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు.