
రాజమండ్రి: ఆదరణ-3 పథకం సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే గోరంట్ల
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ చౌదరి అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆదరణ పథకం ద్వారా వివిధ కుల వృత్తుల వారికి, వారికి అవసరమైన పనిముట్లను అందజేస్తుందని అన్నారు. వివిధ వర్గాల వారికి చేయూత అందించే విధంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఎంపీడీవో శ్రీనివాసరావు, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, మార్ని వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.