స్పీకర్ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై నిరసిస్తూ ఈనెల12న రాష్ట్ర మన్యం బందును విజయవంతం చేయాలని ఆదివాసి జేఏసీ నాయకులు బుధవారం పిలుపునిచ్చారు. దేవీపట్నంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆదివాసి జెఏసి రాష్ట్ర వైస్ చైర్మన్ శేఖర్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం 1/70చట్టంపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలన్నారు. జరగబోయే మన్యం బంద్ కు రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఆదివాసిలు ఉద్యోగులు విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.