రంపచోడవరం: వాడపల్లి ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ

56చూసినవారు
రంపచోడవరం: వాడపల్లి ఏరియా ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ
రంపచోడవరం మండలంలోని వాడపల్లి ఏరియా ఆసుపత్రిని జడ్పీటీసీ వెంకటలక్ష్మి ఎంపీపీ శ్రీదేవి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఎక్కడ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కనబడకూడదని స్పష్టం చేశారు. వైద్యసేవలు అందుతున్న తీరుపై రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్